HBD Chay : 'బంగార్రాజు' వచ్చేశాడు.. రేపు మరో సర్ప్రైజ్..!
HBD Chay : అక్కినేని నాగార్జున, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'బంగార్రాజు'... సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
HBD Chay : అక్కినేని నాగార్జున, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'బంగార్రాజు'... సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మరోహీరోగా నాగచైతన్య నటిస్తున్నాడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది.
సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక్కొక్కటిగా అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఓ పాటతో పాటుగా కృతిశెట్టి లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇక రేపు నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా బంగార్రాజు నుంచి చై లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో చై బంగార్రాజు అనే పాత్రలో కనిపించనున్నాడు. చై 'బంగార్రాజు' అయితే మరీ నాగార్జున పాత్ర ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇక రేపు అభిమానులకి మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నారు మేకర్స్.. రేపు(నవంబర్ 23) చై పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.
కాగా అన్నపూర్ణ స్టూడియో పై ఈ సినిమా తెరకెక్కుతుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.