Chaysam Divorce: మూడేళ్ల క్రితమే ఈ విడాకుల గురించి తెలుసు: వేణు స్వామి
Chaysam Divorce: నాగచైతన్య, సమంత విడిపోతున్న విషయం ఒక్కసారిగా తమ అభిమానులతో పాటు సినీ ప్రపంచం కూడా డిసప్పాయింట్ అయ్యారు.;
Chaysam Divorce: నాగచైతన్య, సమంత విడిపోతున్న విషయం ఒక్కసారిగా తమ అభిమానులతో పాటు సినీ ప్రపంచం కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇటీవల కాలంలో ఈ కపుల్‌ను ఇష్టపడినంతగా ఇంకే టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్‌ను ఇష్టపడలేదు. అందుకే వారు విడిపోతున్న వార్తలు అబద్ధం కావాలని అందరూ కోరుకున్నారు. కొంతమంది మాత్రం చైతూ, సమంతల కదలికలు చూసి నిజంగానే వారు విడిపిపోతున్నారేమో అని అనుమానించారు.
కానీ వారి విడాకుల విషయం ఒక ఆస్ట్రాలజర్ మూడేళ్ల క్రితమే చెప్పారు. ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చైతన్య, సమంత విడిపోతారని మూడేళ్ల క్రితమే కామెంట్స్ చేసారు. కానీ దాన్ని అప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఈరోజు ఆయన జ్యోతిష్యం నిజమేనని నిరూపణ అయ్యింది.
దానికి ఆయన స్పందిస్తూ.. "నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి కోపం లేదు.. అఖిల్ ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. అలాగే జరిగింది. అలాగే నాగచైతన్య, సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను." అన్నారు.