Chhaava collections : ఛావా ఫస్ట్ డే తెలుగు కలెక్షన్స్ ఎంత

Update: 2025-03-08 06:00 GMT

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా, వినీత్ కుమార్ సింగ్, అశుతోష్ రానా, దివ్యదత్తా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించిన ఛావా మూవీకి హిందీలో అద్భుతమైన రెస్పాన్స్ తో పాటు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ కథగా వచ్చిన ఈ మూవీ చరిత్రలో ఇప్పటి వరకూ చూడని కోణాలను ఆవిష్కరించిందనే కామెంట్స్ వచ్చాయి. అదే టైమ్ లో సినిమా కోసం కథలో అనేక మార్పులు చేసినట్టు,చారిత్రక వక్రీకరణలు ఉన్నట్టు దర్శకుడే ఒప్పుకున్నాడు. అయినా భారతీయుల్లోని భావోద్వేగాలను రగలించడంలో వెండితెర సాక్షిగా ఛావా సక్సెస్ అయిందనే చెప్పాలి. అలాంటి మూవీని ప్రాంతీయ భాషల్లో కూడా చూడాలనుకున్నారు ప్రేక్షకులు. ఆ క్రమంలో తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశాడు.

ఈ శుక్రవారం విడుదలైన ఛావాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పాలి. మొదటి రోజు దాదాపు 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. ఓ రకంగా ఇది మంచి నంబర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీకి ఎలాంటి ప్రమోషన్ చేయలేదు. కేవలం మౌత్ టాక్ తోనే ఓపెనింగ్స్ మొదలయ్యాయి. వీకెండ్ లో మరింతగా పుంజుకునే అవకాశాలున్నాయి.పైగా డబ్బింగ్ కూడా బావుంది. ట్రైలర్ లో చూసినప్పుడు కాస్త తేడాగా ఉంది అనిపించినా.. థియేటర్స్ డబ్బింగ్ బాగానే అనిపించిందంటున్నారు చూసిన వాళ్లంతా. మొత్తంగా ఛావాకు తెలుగులో మరీ ఎక్స్ పెక్ట్ చేసినంత కాదు కానీ.. మంచి ఓపెనింగ్సే వచ్చాయని చెప్పాలి. 

Tags:    

Similar News