చాలా రోజుల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కి తిరుగులేని కళ వచ్చింది. కొన్నాళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేక నానా తంటాలూ పడుతూ.. పుష్ప 2 ఇచ్చిన జోష్ తోనే లాగించేస్తోన్న హిందీ సినిమాకు విక్కీ కౌశల్ ఊపు తెచ్చాడు. అతను నటించిన 'ఛావా' బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ కథతో రూపొందింది. "హిందూరాజ్య" స్థాపన కోసం కదిలిన శంభాజీ కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనికి తోడు అద్భుతమైన ఎమోషన్స్, యాక్షన్ తో పాటు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చింది. కేవలం హిందీలోనే ఈ మూవీ ఫస్ట్ డే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించింది. ఓపెనింగ్ డే 32 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది విక్కీ కౌశల్ కెరీర్ లోనే హయ్యొస్ట్ ఓపెనింగ్స్ కావడం విశేషం.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వానికి తోడు ఏఆర్ రహమాన్ అద్భుతమైన మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాయి. రష్మిక శంభాజీ మహారాజ్ భార్య యషూ బాయి గా గొప్ప నటన చూపించింది. పుష్ప 2తో రీసెంట్ గానే బాలీవుడ్ ను మెప్పించిన తనకు ఇది మరో బ్లాక్ బస్టర్ గా నిలవబోతోందనే చెప్పాలి. ఛావా ఓపెనింగ్ జోష్ తో పాటు రివ్యూస్ అన్నీ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. విపరీతమైన రేటింగ్స్ కూడా కనిస్తున్నాయి. సో.. ఊపు చూస్తుంటే ఈజీగా 200 -250 కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంతకు మించి వసూలు చేసినా ఆశ్చర్యం లేదేమో.