Chhaava : ఛావా పై బాలీవుడ్ భారీ ఆశలు

Update: 2025-02-13 12:15 GMT

2024 అంతా బాలీవుడ్ సరైన విజయాలు లేక ఇబ్బంది పడింది. స్త్రీ 2 ను చూసి అదే ఎక్కువని సంబర పడ్డారు. మళ్లీ అలాంటి మూవీ ఎప్పుడో అనుకుంటోన్న టైమ్ లో ఇదుగో వస్తున్నాం అనేలా కనిపిస్తోంది ‘ఛావా’. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేశాడు. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ గా అషుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, డయానా పెంటీ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గత డిసెంబర్ 7న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని పుష్ప 2 కోసం పోస్ట్ పోన్ చేసి ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా విడుదల చేస్తున్నారు.

ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథతో వస్తోన్న సినిమా ఛావా. హిస్టారిల్ ఫ్యాక్ట్స్ తో దేశభక్తిని రగిలించే కథనంతో రాబోతోందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మొన్నటి వరకూ ఈ మూవీపై పెద్ద బజ్ లేదు అనుకున్నారు. కానీ మెయిన్ టీమ్ అంతా నార్త్ అంతా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ ఆకట్టుకుంది. దాని ఫలితమో ఏమో.. లేటెస్ట్ గా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా 4 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. అది కూడా ఇవాళ్టితోనే. స్త్రీ 2 తర్వాత ఏ బాలీవుడ్ మూవీకీ ఇంత హైప్ రాలేదు. మరోవైపు అక్కడ కొందరు క్రిటిక్స్ కు ముందుగానే ప్రీమియర్ వేస్తే వాళ్లంతా ఆహా ఓహో అంటున్నారు. అలాంటివి పూర్తిగా నమ్మకపోయినా మరీ అబద్ధాలైతే ఉండవు కదా.

దేశంలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కల్పితాలైతే ఖచ్చితంగా ఉంటాయి. అయితే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ను పక్కన పెడితే సినిమా కథనం ఆకట్టుకునేలా ఎమోషనల్ గా ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఏదేమైనా 4 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి అనే వార్త బాలీవుడ్ లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఒకవేళ అంతా ఊహించినట్టు ఛావా బ్లాక్ బస్టర్ అయితే 2025కి ఇదే ఫస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. 

Tags:    

Similar News