Chiranjeevi : సుకుమార్‌తో కమర్షియల్ యాడ్.. భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్న మెగాస్టార్..!
Chiranjeevi : టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఒకపక్కా సినిమాలు చేస్తూనే మరోపక్కా కమర్షియల్ యాడ్‌లో కూడా నటిస్తూ మరింత బిజీ అవుతున్నారు...;
Chiranjeevi : టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఒకపక్కా సినిమాలు చేస్తూనే మరోపక్కా కమర్షియల్ యాడ్‌లో కూడా నటిస్తూ మరింత బిజీ అవుతున్నారు... ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెరీ ఫాస్ట్‌గా ఉన్నాడని చెప్పాలి.. ఏ చిన్న కమర్షియల్ యాడ్‌ని కూడా బన్నీ వదలడం లేదు.. తాజాగా ఈ రేసులోకి ఎంటర్ అయ్యారు చిరంజీవి.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో ఓ యాడ్‌లో నటించారు మెగాస్టార్.. ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో చిరు మరింత యంగ్‌గా కనిపించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ యాడ్ కోసం చిరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం చిరు ఈ ప్రకటన కోసం రూ. ఏడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. చిరుతో పాటుగా దర్శకుడు సుకుమార్, అనసూయ, ఖుష్బూ కూడా భారీగానే పారితోషికం అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలావుండగా కొరటాల డైరెక్షన్‌లో వస్తోన్న ఆచార్య మూవీని కంప్లీట్ చేసిన చిరంజీవి.. ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు.
ఇందులో మెహర్ రమేష్ డైరెక్షన్‌లో భోళాశంకర్, మోహన్ రాజా డైరెక్షన్‌లో గాడ్‌ఫాదర్, బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమాని సెట్స్ పైన ఉంచాడు చిరు.. ఆ తర్వాత ఛలో ఫేం వెంకీ కుడుములతో ఓ సినిమా చేయనున్నాడు చిరంజీవి.