Chiyaan Vikram : విక్రమ్ నెక్స్ట్ మూవీ ఆ కాలానికి చెందిందా..?
Chiyaan Vikram : కాలీవుడ్ స్టార్ విక్రమ్ తన అభిమానులకు మరో సప్రైజ్ ఇచ్చారు;
Chiyaan Vikram : కాలీవుడ్ స్టార్ విక్రమ్ తన అభిమానులకు మరో సప్రైజ్ ఇచ్చారు. ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన ఆయన ఇప్పుడు 1800ల సంవత్సరం నాటి కథలో నటించనున్నారు. కబాలి మూవీ ఫేమ్ డైరెక్టర్ పారంజిత్ ఈ సినిమకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా విక్రమ్ కెరీర్‌లో 61వ మూవీ అవుతంది. మూవీ టైటిల్ ఫైనలైజ్ అయ్యేంతవరకు చియాన్ 61గానే ఈ చిత్రాన్ని గుర్తించనున్నారు.
చియాన్ 61 గురించి పారంజిత్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడిచేశారు. ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందన్నారు. 1800వ కాలం నాటిది కాబట్టి దానికి సంబంధించిన సెట్ రెడీ అవుతుందన్నారు డైరెక్టర్. విక్రమ్ నటించిన కోబ్రా, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు సెప్టెంబర్‌లో రిలీజ్ కానున్నాయి. అవి రిలీజ్ కాగానే విక్రమ తదుపరి మూవీస్ సెట్స్‌పైకి వెళ్తాయి