Balakrishna : అదంతా అవాస్తవం.. ఇలాంటివి స్ప్రెడ్ చేయొద్దు..!
Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణకి మోకాలికి మైనర్ సర్జరీ అయిందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;
Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణకి మోకాలికి మైనర్ సర్జరీ అయిందంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. బాలయ్య మోకాలికి నీ ప్యాడ్ ధరించి ఉండడంతో అ వార్తలకి మరింత బలం చేకూరింది.. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తరఫు ప్రతినిధులు తెలిపారు. బాలయ్య కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లారని వారు వెల్లడించారు. ఇలాంటి అవాస్తవాలను స్ప్రెడ్ చేయొద్దని కోరారు.
కాగా గతేడాది అఖండ మూవీతో భారీ కొట్టిన బాలయ్య..ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది బాలయ్యకి 107 సినిమా కావడం విశేషం. ఇందులో బాలయ్య సరసన శృతిహసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.