Color Photo Director Sandeep Raj : కలర్ ఫొటో డైరెక్టర్ పెళ్లైంది

Update: 2024-12-07 10:30 GMT

టాలీవుడ్ డైరెక్టర్, నటి మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. తిరుమలలో కలర్ ఫొటో సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్ తన కొత్త జీవితం లోకి అడుగుపెట్టాడు. నటి చాందిని రావు తో ఏడడుగులు వేశాడు. యూట్యూబ్ ఛానెల్ చాయ్ బిస్కెట్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కు దర్శకత్వం వహించిన సందీప్ రాజ్ తన టేకింగ్ తో బోలెడంత మంది అభి మానులను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 2020లో కలర్ ఫొటో సినిమాతో ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చాడు. సుహాస్, చాందిని చౌదరి హీరో, హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ కరోనా కారణంగా ఓటీటీలోనే విడుద లైంది. అయినా సూపర్ హిట్ గా నిలిచింది. దర్శకుడిగా సందీప్ రాజ్ కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఇదే సినిమాకు గానూ జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ప్రస్తుతం సందీప్ రాజ్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కలర్ ఫొటో సినిమాలో నటించిన చాందిని రావు సందీప్ మధ్య షూటింగ్ లోనే ప్రేమ మొదలైంది. నిన్న వీళ్లు పెద్దల సమక్షంలో తిరుమల ఏడుకొండల వాడి సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Tags:    

Similar News