మామూలుగా నిజమైన కోర్ట్ లు సోమవారం ఎక్కువ కేస్ లతో బిజీగా ఉంటాయి. అలాగే కోర్ట్ మూవీ కూడా సోమవారం రోజు ఎక్కువ కలెక్షన్స్ తో థియేటర్స్ ను బిజీగా ఉంచేసింది. మామూలుగా ఇలాంటి చిన్న సినిమాలకు వీక్ ఎండ్స్ లో కలిసొచ్చినా వీక్ డేస్ లో 'వీక్'అవుతాయి. బట్ కోర్ట్ మూవీ సోమవారం కూడా సత్తా చాటింది. వీకెండ్ లో 24 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ మూవీ సోమవారం దాదాపు 5 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ప్రీమియర్స్ తో కలిపి మొత్తం నాలుగు రోజుల్లో 28.9 కోట్ల వసూళ్లు సాధించింది.
నాని నిర్మించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ డైరెక్ట్ చేశాడు. పోక్సో చట్టం దుర్వినియోగం అవుతున్న తీరుపై రూపొందించిన ఈ మూవీకి కథ, కథనంతో పాటు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచింది. దీంతో ఆడియన్స్ నుంచి హిట్ టాక్ తో పాటు మౌత్ టాక్ కూడా బాగా వచ్చింది. ఈ కారణంగానే చాలామంది కోర్ట్ మూవీని చూడాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు. అందుకే ఈ రేంజ్ లో వసూళ్లు వస్తున్నాయి.
నిజానికి ఈ మూవీ బడ్జెట్ కేవలం 11 కోట్లు. ఇప్పటికే డిజిటల్ రైట్స్ రూపంలో 9 కోట్లు వచ్చాయి. అంటే ఈ మధ్య కాలంలో ఇదే బిగ్గెస్ట్ హిట్ గా చెప్పొచ్చు. కొన్నవాళ్లందరికీ మంచి లాభాలు తెచ్చే సినిమాగా నిలవబోతోంది కోర్ట్.