Court Movie : కోర్ట్ మూవీ జాబిలి.. రీల్స్ టు స్క్రీన్

Update: 2025-03-15 09:45 GMT

సినిమా హిట్ అవడం వల్ల కాకపోవడం వల్ల ఏం జరుగుతుందీ అంటే.. నిర్మాతల విషయం పక్కన పెడితే.. ఎంత టాలెంట్ ఉన్నా సినిమా పోతే జనం పట్టించుకోరు. హిట్ అయితే ఖచ్చితంగా గుర్తుపడతారు.. గుర్తు పెట్టుకుంటారు. అలా ఇప్పుడు నాని నిర్మించిన కోర్ట్ మూవీలో జాబిలి పాత్రతో బలమైన ఇంపాక్ట్ చూపించిన నటి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. టీనేజ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీలో 18యేళ్లకు దగ్గరగా ఉన్న అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించిన ఆ అమ్మాయి పేరు శ్రీదేవి. మరి ఈ శ్రీదేవే జాబిలిగా ఎలా సెలెక్ట్ అయింది అనే డౌట్ అందరిలోనూ రావొచ్చు. అలాగే అసలెరీ అమ్మాయి అనే ఆరాలు కూడా తీస్తుండవచ్చు.

ఈ అమ్మాయి ఎవరూ అంటే కాకినాడకు చెందినది. కాలేజ్ (ఇంటర్) లో చదువుకున్నప్పటి నుంచి రీల్స్ చేస్తుండేదట. ఆ రీల్స్ కు మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారని.. ఇన్స్ స్టాగ్రామ్ లో చాలా ఫాలోయింగ్ కూడా ఉంది. అలాగే తనను రీల్స్ లో చూసినప్పుడు చాలామంది అచ్చం హీరోయిన్ లావణ్య త్రిపాఠిలా ఉన్నావ్ అని ప్రశంసించే వారట.

అలా ఆ రీల్స్ లోనే ఈమెను చూశాడు దర్శకుడు రామ్ జగదీష్. అలాగని తనొక్కతే కాదు.. ఈ జాబిలి పాత్ర కోసం చాలామంది అమ్మాయిలను ఆడిషన్ చేశారట. ఫైనల్ గా శ్రీదేవి ఫైనల్ అయింది. దర్శకుడి నిర్ణయం తప్పు కాదు అని ఈ మూవీలో తన ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రూవ్ చేసింది. చాలా సన్నివేశాల్లో అద్భుతమైన మెచ్యూరిటీ చూపించింది శ్రీదేవి. ఈ నటనకే జనం ఫిదా అవుతున్నారు. క్లైమాక్స్ లో తను కోర్ట్ కు వచ్చినప్పుడు ఆ కుర్రాడిని చూసిన చూపు చాలు.. పాపలో ఎంతమంది నటి ఉందో చెప్పడానికి. ముఖ్యంగా తన నటనలో గొప్ప ఈజ్ ఉంది. ఇది ఉంటే ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా నటించేస్తారు వాళ్లు. మరి ఈ జాబిలి తెలుగు సినిమా పరిశ్రమలో వెలిగిపోతుందా లేక కోర్ట్ తో ఆగుతుందా అనేది చూడాలి.

Tags:    

Similar News