మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 పై భారీ అంచనాలున్నాయి. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించిన ఈచిత్రంలో ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. కేవలం ఒక్క పాట మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆ పాట ఇద్దరు హీరోలపై చిత్రీకరించాల్సి ఉంది. మార్చిలోనే షూటింగ్ అనుకున్నారు. కానీ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్ కు గాయం కావడంతో పోస్ట్ పోన్ అయింది. ఇటు చూస్తే సినిమా ఆగస్ట్ 14నే విడుదలవుతోంది. మరి ఎప్పుడు షూట్ చేస్తారా అని ఫ్యాన్స్ లో ఓ కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ కు తెరవేసింది యశ్ రాజ్ బ్యానర్.
జూన్ నెలలో యశ్ రాజ్ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. మరి జూన్ లో ఏ వారం షూటింగ్ ఉంటుంది అనే అప్డేట్ రావాల్సి ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో నాటు నాటు సాంగ్ క్రేజ్ చూస్తే తెలిసింది. ఇటు ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా బెస్ట్ డ్యాన్సర్. అందుకే వీరి డ్యాన్స్ నంబర్ కూడా నాటు నాటు రేంజ్ లో దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుందని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.