అడివి శేష్ ఈ మధ్య మూవీస్ విషయంలో స్లో అయ్యాడు. లాస్ట్ ఇయర్ రావాల్సిన మూవీ డెకాయిట్ కాల్షీట్స్ వల్ల లేట్ అవుతోంది. అందుకే శ్రుతి హాసన్ ను తప్పించాడు. అప్పటికే ఈ మూవీ కొంత షూటింగ్ కూడా అయిపోయింది. దీంతో మరో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను తీసుకుని మళ్లీ ఆ షూట్ ను చేశాడు. దీంతో రిలీజ్ డేట్ బాగా లేట్ అవుతోంది. దీంతో పాటు అతని గూఢచారి 2 విషయంలో కూడా బాగా లేట్ అవుతోంది. అయినా ఈ రెండు సినిమాలూ 2026లోనే రిలీజ్ కాబోతున్నాయి. గూఢచారి 2 సెకండ్ హాఫ్ లో విడుదల కాబోతోంది. డెకాయిట్ మాత్రం ఫస్ట్ హాఫ్ లోనే విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీ మార్చి 19న విడుదల కాబోతోంది. ఆ తర్వాతి వారమే పెద్ది చిత్రం, ద ప్యారడైజ్ లు కూడా రిలీజ్ డేట్స్ వేసి ఉన్నాయి.
ఇక డెకాయిట్ మాత్రం కొత్తగా ఉండే మూవీ అని చెబుతున్నారు. శేష్ గత చిత్రాల్లానే అంతా కొత్తదనంతో ఉండబోతోంది అని చెబుతున్నారు. ఇక ఈ మూవీ టీజర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నాడు శేష్. డిసెంబర్ 18న టీజర్ విడుదల చేస్తున్నాం అని ముందే ప్రకటించారు. మరి శ్రుతి హాసన్ తో ఉండబోతోన్న మూవీ టీజర్ క్యాన్సిల్ అయింది. మరి మృణాల్ ఠాకూర్ తో మాత్రం అదే కథతోనే వస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. షనీల్ డియో అనే దర్శకుడు ఈ చిత్రంతో చేయబోతున్నాడు. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునిల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మొత్తంగా ఈ మూవీ విడుదలకు చాలా టైమ్ ఉంది. ఈ లోగా టీజర్ ను చేయడంలో అతని ఆంతర్యం ఏంటనేది చూడాలి.