Daggubati Suresh : దగ్గుబాటి ఫ్యామిలీ ఓపెన్ లెటర్ తో వార్నింగ్

Update: 2026-02-05 09:45 GMT

డెక్కన్ కిచెన్ కు సంబంధించిన ఇష్యూ దగ్గుబాటి ఫ్యామిలీ కోర్ట్ పరిధిలో ఉంది. ఇది పూర్తిగా తమ కుటుంబానికి సంబంధించిన విషయం అని చెబుతూ ఈ విషయంలో ఎలాంటి చర్చలు ఉండరాదని చెబుతూ దగ్గుబాటి ఫ్యామిలీ ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ డెక్కన్ కిచెన్ వివాదం ప్రస్తుతం నాంపల్లి కోర్ట్ లో ఉంది. ఈ కేస్ కు సంబంధించి కోర్ట్ లో వాదనలు వినిపించారు. తర్వాతి వివరణను ఈ నెల 12కి వాయిదా వేసింది కోర్ట్. కోర్ట్ పరిధిలోని అంశం కాబట్టి ఎలాంటి చర్చలు ఉండొద్దు అని భావించే ఆ ఫ్యామిలీ ఓ లెటర్ విడుదల చేసింది.

‘దగ్గుబాటి కుటుంబం పైన ఎలాంటి అవాస్తవ ఆరోపణలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దగ్గుబాటి కుటుంబం హెచ్చరిస్తోంది. తమ వ్యక్తిగత లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తమ కుటుంబం తప్పు చేసినట్లు దేశంలో ఏ కోర్టు కూడా తీర్పు ఇవ్వలేదు.

రొటీన్ గా జరిగే కోర్టు విచారణనే తాము తప్పు చేసినట్టు గా దుష్ప్రచారం చేయడం చట్ట విరుద్ధం. కోర్టు విచారణ లో ఉన్న విషయాన్ని అనవసరంగా సోషల్ మీడియాలో చర్చిస్తూ సంచలనం చేయడం తగదు. ఇలాంటి వారు క్రిమినల్, సివిల్ చర్యలకు బాధ్యులవుతారు.

సోషల్ మీడియా పేజెస్, యూ ట్యూబ్ ఛానల్స్, న్యూస్ పోర్టల్స్ ఇతరులు ఎవరైనా ఇలాంటి ఆరోపణలు ప్రచారం చేయడం మానుకోవాలి. ఇప్పటికే షేర్ చేసినట్లయితే వెంటనే తొలగించాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిచో దగ్గుబాటి కుటుంబం పై ప్రతిష్ఠను దిగజార్చి నందుకు కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరిస్తున్నా ము.

-దగ్గుబాటి కుటుంబం’

Tags:    

Similar News