Santhanam : ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయిన డిడీ నెక్ట్స్ లెవల్

Update: 2025-06-10 07:06 GMT

కమెడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకుని హీరోగానూ నవ్విస్తున్నాడు తమిళ నటుడు సంతానం. అదిరిపోయే టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించడం సంతానం స్టైల్. అతను నటించిన ‘దిల్లుకు దుడ్డు’అనే హారర్ మూవీని ఫ్రాంఛైజీలా కంటిన్యూ చేస్తున్నాడు. ఆ క్రమంలో రీసెంట్ గా వచ్చిన నాలుగో భాగం ‘డీడీ నెక్ట్స్ లెవల్’ థియేటర్స్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఎస్ ప్రేమ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సంతానంతో పాటు సెల్వ రాఘవన్, గౌతమ్ మీనన్, గీతికా తివారీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ది షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈసారి స‌రికొత్త‌గా సూప‌ర్ నేచుర‌ల్ ట్విస్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 13 నుంచి జీ 5లో స్ట్రీమ్ కాబోతోంది.

ఈ యాక్షన్ హారర్ కామెడీలో సర్ ప్రైజ్ లు, కన్ఫ్యూజన్స్ తో కామెడీ పండించారు. దీంతో పాటు లైటర్ వే లో హారర్ కూడా కనిపిస్తుంది. సెటైరికల్, స్లాప్‌స్టిక్ కామెడీ క‌ల‌గ‌లిసి వినోదాత్మ‌కంగా సినిమాను రూపొందించాడు దర్శకుడు. ఇది క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఓ సినిమా రివ్యూవ‌ర్‌పై ఓ ద‌ర్శ‌కుడు ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంటాడు. అందువ‌ల్ల అతన్ని ట్రాప్ చేయించి ఓ ప్లానింగ్ ప్రకారం శాప‌గ్ర‌స్త‌మైన చిత్రంలో ఇరుక్కునేలా చేస్తాడు. ఓ మాయా డైరీ ఈ క‌థనాన్ని నియంత్రిస్తుంటుంది. అప్పుడు స‌ద‌రు రివ్యూవ‌ర్ ప్రాణాంత‌క‌మైన ఆట నుంచి పోరాడి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడనేదే సినిమా.

కథగా చూస్తే.. త‌న వాక్ చాతుర్యంతో సినిమాల‌కు రివ్యూలు చెప్పే కిస్సా (సంతానం)కు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించే ద‌ర్శ‌కుడు హిచ్‌కాక్ ఇరుద‌య‌రాజ్(సెల్వ‌రాఘ‌వ‌న్‌).. ర‌హస్యంగా ఓ సినిమాను చూడ‌టానికి వ్య‌క్తిగ‌తంగా ర‌మ్మ‌ని ఆహ్వానిస్తాడు. కిస్సా సాధార‌ణంగా డ్రామాతో కూడిన సినిమా అనుకుని వ‌స్తాడు. కానీ నిజానికి సినిమా అలా ఉండ‌దు. ప్రొజెక్ట‌ర్ ఓసారి ఆన్ కాగానే, కిస్సా ప్ర‌పంచం ఒక్క‌సారిగా త‌ల‌కిందులుగా మారుతుంది. కొంత‌సేప‌టికి కిస్సా ఓ దెయ్యాలు, భూతాలు ఉండే క్రూయిజ్‌లో క‌న్ను తెరుస్తాడు. అక్క‌డ లాజిక్కులేవీ ప‌నిచేయ‌వు. అక్క‌డ పాటించాల్సిన నియమాల గురించి ఓ మ్యాజిక‌ల్ డైరీలో రాసి పెట్ట‌ి ఉంటుంది. అత‌నితో పాటు మ‌రో ఇద్ద‌రు రివ్యూవ‌ర్లు కూడా అందులో చిక్కుకుంటారు. దీంతో వారు డైరీలో విష‌యాల‌ను డీకోడ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతారు. అందులో భాగంగా అతింద్రీయ శ‌క్తుల బ‌ల‌హీన‌త‌లు గుర్తించాలి. ఆ స‌మ‌యంలో ఎదుర‌య్యే భ‌యాన‌క ప‌రిస్థితుల‌ను దాటాలి. ఇంత‌టితో క‌థ ముగియ‌దు. కిస్సా గ‌ర్ల్‌ఫ్రెండ్ కూడా ఓ ఆత్మ‌గా మారిపోయుంటుంది. ఈ క‌థాగ‌మ‌నంలో హాస్యంతో నిండిన మ‌లుపులు, రోల‌ర్ కోస్ట‌ర్‌లాగా అనిపించే స‌న్నివేశాలతో నిండి ఉంటాయి. ‘డెవిల్స్ డ‌బుల్‌: నెక్ట్స్ లెవ‌ల్‌’ అనేది హార‌ర్‌, హాస్యం, అడ్వెంచ‌ర్‌తో నిండి ఉంది. ఓ సినిమా రివ్యూవ‌ర్ త‌ను ఉన్న సినిమా రివ్యూ క‌థ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా.. ఈ క‌థ‌లో త‌నే విల‌నా? సినిమా టైటిల్ కార్డ్స్ ప‌డుతున్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు ఎవ‌రు ఏమ‌వుతార‌నేదే సినిమా.

సో.. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ డిఫరెంట్ హారర్ మూవీ జీ 5 లో తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ శుక్రవారం నుంచి సందడి చేయబోతోంది.

Tags:    

Similar News