Samantha: డియర్ సామ్.. ఎక్కడికి వెళ్లారు, ఏమైపోయారు.. నెటిజన్స్ పోస్టులు..
Samantha: ఇరవై రోజులైపోయింది సామ్.. ఉలుకూ లేదు, పలుకూ లేదు.. ఊ లేదు.. ఊహూ లేదు.. ఎక్కడికి వెళ్లిపోయారు..;
Samantha: ఇరవై రోజులైపోయింది సామ్.. ఉలుకూ లేదు, పలుకూ లేదు.. ఊ లేదు.. ఊహూ లేదు.. ఎక్కడికి వెళ్లిపోయారు.. మీ సినిమాల కోసం వెయిట్ చేయడం కంటే మీ పోస్టుల కోసం వెయిట్ చేయడం మాకు చాలా కష్టంగా ఉంది.
ఏదో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే.. సమంత ఇలా చేసింది అలా చేసింది అని ఆరోజంతా చెప్పుకుంటాం. అంత యాక్టివ్‌గా ఉండే సామ్ ఇప్పుడెందుకు ఇంత డల్లయింది. జులై 29 తరవాత ఒక్క పోస్టూ లేదు అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆరా తీస్తున్నారు.
సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లో కూడా పేరు తెచ్చుకున్న సమంత.. ఫ్యామిలీ మ్యాన్‌తో ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు ఆ టీమ్ మరోసారి సామ్‌తో వర్క్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వరుణ్ థావన్, సామ్ కీలక పాత్రలో నటించనున్నారు. దీనికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల కోసమే ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు జాతీయ పత్రికలు వెల్లడించాయి. అందుకే సామ్ సోషల్ మీడియాతో టచ్‌లో లేదని పత్రికలు ఉటంకించాయి.
ఆ మధ్య కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్‌లో దర్శనమిచ్చిన సామ్.. చైతన్యకు వ్యతిరేకంగా మాట్లాడడంతో కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. దాంతో సామ్ కలత చెంది కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారేమో అని అభిమానులు భావిస్తున్నారు.
సమంత నటించిన శాకుంతలం, యశోద రిలీజ్ కావలసి ఉంది. విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషీ చిత్రంలో కూడా సామ్ నటిస్తోంది. ఇంకా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో కూడా ఆఫర్లు వచ్చాయి. ఇన్ని చేస్తూ ఎంత బిజీగా ఉన్నా ఏ వర్కవుట్‌కి సంబంధించిన పోస్ట్ పెట్టినా ఫ్యాన్స్ కాస్త కుదుట పడతారు. ఆమె గురించి ఇంతలా ఆలోచించడం మానేస్తారు.