ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీలీల. వరుస సినిమా ఆఫర్లతో బిజిబిజీగా మారిపోయింది. ఇక ఇటీవల పుష్ప2 సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసి పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇదే విషయాన్ని ఐఎమ్‌డీబీ గుర్తించింది. దీంతో పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టులో మూడు స్థానం కొట్టేసింది. ఎంతో మంది స్టార్ యాక్టర్స్ ఉన్నా వారందరినీ శ్రీలీల వెనక్కి నెట్టేయడం గమనార్హం. దీనిపై ఈబ్యూటీ ఇన్ స్టా వేదికగా స్పందించింది. ‘ఎప్పటికీ కృతజ్ఞతగా రుణపడి ఉంటాను. దీనిని మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాను' అంటూ ఫ్యాన్స్ గురించి రాసుకొచ్చింది. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో శ్రీలీల ఫుల్ బిజీగా ఉంది.
ఏడాది అంతా ఫ్యాన్స్‌ను పలకరించకుండా ‘పుష్ప 2’లో కిసిక్ అంటూ కుర్రకారు ముందుకు వచ్చింది శ్రీలీల. ఈ ఒక్క సినిమాతో తన పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. తను ఈ ఏడాది మొత్తం అసలు వెండితెరపై కనిపించకపోయినా.. కిసిక్ పాటతో అంతా కవర్ చేసేసింది. చేసింది ఐటెమ్ సాంగే అయినా కూడా ‘పుష్ప 2’ టీమ్‌తో కలిసి యాక్టివ్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంది శ్రీలీల. దీంతో తన గురించి సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వైరల్‌గా మారింది. అందులో భాగంగానే ఇప్పుడు శ్రీలీల చేతిలో దాదాపు అరడజనకు పైగా ఆఫర్లు ఉన్నాయి. తాజాగా అక్కినేని వారసులతో ఒకేసారి నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.