ఐకన్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను ఎందుకు పక్కన పెట్టాడో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. పుష్ప, పుష్ప 2తో ప్యాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్ గా అవతరించాడు అల్లు అర్జున్. రాజమౌళి లేకుండానే ఈ స్థాయికి వెళ్లిన ఫస్ట్ తెలుగు స్టార్ గానూ అతన్ని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. మామూలుగా ఇదో సూపర్ మేన్ మూవీ అని తెలిసేలా హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోను మీట్ అయినప్పుడు అందరికీ అర్థం అయింది. అయితే హాలీవుడ్ ను కూడా మించి అనిపించేలా వీళ్లు రాబోతున్నారని తాజాగా దీపికా పదుకోణ్ పరిచయ వీడియోతో అర్థం అవుతోంది. యస్.. ఈ మూవీలో హీరోయిన్ గా దీపికాను ఫైనల్ చేశారు. తన అనౌన్స్ మెంట్ వీడియో చూస్తేనే గూస్ బంప్స్ అనేలా ఉంది. అందుకోసం వాడిన విజువల్స్ చూస్తుంటే.. ఇది రాజుల కాలం నాటి కథ అనిపిస్తోంది. యుధ్ధాలు, గుర్రాలు, ఆధిపత్య పోరాటాలు.. ఇవన్నీ నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతున్నాని చెప్పకనే చెప్పాడు అట్లీ.
దీపికా పదుకోణ్ పాత్ర కూడా చాలా బలంగా ఉండబోతోందని ఈ వీడియోతోనే తేల్చాడు. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తరహాలో ఉండొచ్చేమో అనిపించేంత కాస్ట్ లీ నెస్ తో రాబోతున్నారనిపిస్తోంది. ఈ రేంజ్ స్పాన్ ఉన్న సినిమాను బహుశా ఇండియన్ సినిమా ఇప్పటి వరకూ చూడలేదు అనుకోవచ్చు. అంత భారీదనంతో వస్తున్నాం అని వీళ్లు చాలా కాన్ఫిడెంట్ గా ఈ వీడియోతో చెప్పేశారు.
మొత్తంగా దీపికా రీసెంట్ గా స్పిరిట్ మూవీ నుంచి తప్పుకోవడం.. సందీప్ రెడ్డి వంగా అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కాస్త ఫైర్ కావడం.. ఇవన్నీ తను సెంటర్ పాయింట్ గా కొంచెం నెగెటివ్ గా వెళ్లింది. బట్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తను హీరోయిన్ గా ఉండటం.. తన పాత్ర కూడా ఓ రేంజ్ లో ఉండబోతోందనేలా వీడియో కట్ చేయడం.. అంతకు ముందే అట్లీ కథ చెబుతుంటే తను అందులో లీనం కావడం.. ఆయా సన్నివేశాలను ఊహించుకుంటున్నట్టుగా కనిపించడం చూస్తుంటు.. తనకు స్పిరిట్ కు మించిన కథే వచ్చేసింది అనుకోవచ్చు.
ఇక అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్నాడు.