NTR_Deepika Padukone : ఇంట్రెస్టింగ్.. ఎన్టీఆర్‌తో దీపికా పదుకొణె..!
NTR_Deepika Padukone : ఇటీవల RRR మూవీతో సక్సెస్ కొట్టి డబుల్ హ్యట్రిక్‌ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు..;
NTR_Deepika Padukone : ఇటీవల RRR మూవీతో సక్సెస్ కొట్టి డబుల్ హ్యట్రిక్‌ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.. ఈ నెల(ఏప్రిల్)లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.
ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఆమెతో కథాచర్చలు జరపగా ఆమె కూడా మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఒకవేళ ఇదే నిజం అయితే టాలీవుడ్‌లో దీపికాకి ఇది రెండో సినిమా అవుతోంది. కాగా ప్రభాస్, నాగ్అశ్విన్ కాంబోలో వస్తోన్న మూవీతో దీపికా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.