ఈ మధ్య వస్తోన్న కొత్త వాళ్ల మూవీస్ లో విషయం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా నేటివిటీకి దగ్గరగా ఉండే మూవీస్.. లేదంటే కాస్త ఒరిజినాలిటీకి దగ్గరగా ఉంటే ఇంకా బావుంటాయి. కాకపోతే ఫుల్ మూవీ చూస్తే కానీ అందులో మేటర్ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. బట్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మాత్రం ఆకట్టుకుంటాయి. అలాంటిదే అన్నట్టుగా ఉంది దీవానా మూవీ టీజర్. హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తోన్న మూవీ గ్లింప్స్ విడుదలైంది. అయితే అందులో హీరోయిన్ ఎవరు అనేది తెలియకుండా దాచారు. ఇవాళ టీజర్ విడుదలైంది. టీజర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లా అనిపిస్తోంది. యంగ్ స్టర్స్ కథలు అంటే ఇలాగే ఉండాలి అనే రూల్ ఏం లేదు. రొటీన్ కథలే అయినా ఆకట్టుకునేలా రాసుకుంటే సరిపోతుంది.
ఈ టీజర్ లో ఓ కుర్రాడు హీరోని తిడుతూ.. ‘సస్తవా బే పిల్ల కోసం.. అయినా నువ్వేం చిల్లరగానివే బే.. ఏం దానికన్న అందంగా ఇంకెవరు లేరా దునియాలా..’అంటాడు. దానికి హీరో‘హే.. అది ఇది అనకు బే ఆమెను.. ’ అంటాడు. అలా సాగే టీజర్ లో ఆ అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి నిజంగా చాలా బావుంది. అలాంటి బ్యూటీనే చూడగానే మనసు పారేసుకునే కుర్రాడి కథ ఇది. మరి ఈ పారేసుకున్న మనసు ఆ అమ్మాయికి కూడా నచ్చుతుందా అనేది చూడాల్సింది.
‘ఎంత అందంగా ఉంటే అంత సతాయిస్తర్రా పోర్లు.. అది నీ పాణం పీక్క తినక పోతే నన్నడుగురా’అంటాడా ఫ్రెండ్. నిజంగా ఈ కథ అలాగే సాగుతుందా అనిపించేలా ఉంది. బట్ ఈ టీజర్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ చాలా బావుంది. దాంతో పాటు సాగే పాట కూడా చాలా బావుంది. ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి గీతా ఆర్ట్స్ ముందుకు వచ్చింది. అంటే మూవీలో చాలా విషయం ఉన్నట్టే కదా.
ఇక హర్షిత్ రెడ్డితో పాటు హీరోయిన్ గా స్మేహా మణిమేగలై అనే అమ్మాయి పరిచయం అవుతోంది. అమ్మాయి పేరు మాత్రమే కాదు.. ఫేస్ కూడా చాలా బ్యూటీఫుల్ గా ఉంది. శ్రీకాంత్ సంగిశెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అర్హా మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలు. ఈశ్వర్ చంద్ సంగీతం అందిస్తున్నాడు.