యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర 1. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈమూవీని కొరటాల శివ రూపొందిస్తున్నాడు. ప్యాన్ ఇండియా కంటెంట్ తో వస్తోన్న ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా వస్తోంది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ కెరీర్ లో మరో వయెలెంట్ మూవీగా దేవర తెరకెక్కుతోంది. ఈ సెప్టెంబర్ 27న విడుదల కాబోతోన్న దేవర నుంచి ఆ మధ్య వచ్చిన ఫస్ట్ సింగిల్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఈ సారి డ్యూయొట్ తో వస్తున్నారు. ఈ నెల 5న పాట విడుదల కాబోతోంది. ఈ పాటకు సంబంధించిన అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు ట్రోల్స్ కు గురవుతోంది. ఈ పోస్టర్ లో గ్రాఫిక్స్ చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు అంటూ సెటైర్స్ వేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్, జాన్వీల కాళ్లు నేలలో కలిసిపోయాయి. అవి ఆ అడవిలో నేలపైనో లేక చెట్టు వేర్లపైనో ఉండాలి. బట్ కనిపించకుండా పోయాయి. ఇది గ్రాఫికల్ మిస్టేక్. అది చూసుకోకుండానే వదిలేసింది మూవీ టీమ్.
దీనికి మించి వస్తోన్న మీమ్స్ అండ్ ట్రోల్స్ అన్నీ ఎన్టీఆర్ హైట్ పై కనిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ కంటే ఎన్టీఆర్ తక్కువ హైట్ ఉన్నాడని సోషల్ మీడియాలో చాలా మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని పాత వీడియోస్ తో పాటు వేరే వారి కంటెంట్స్ ను యాడ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తక్కువ హైట్ ఉన్నాడు కాబట్టే హీరోయిన్ ను కిందకి వంచారు అంటూ ఆ పోస్టర్ పైనా మీమ్స్ క్రియేట్ చేసి వదులుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ చాలా తగ్గింది. అందుకే వీటికి కౌంటర్స్ ఇచ్చేఅతని ఫ్యాన్స్ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఎన్టీఆర్ ను కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా టార్గెట్ చేశారు. దాని వెనక ఎవరున్నారో కానీ.. ఇప్పుడు ఎన్టీఆర్ వెనక పెద్దగా ఫ్యాన్స్ లేరా అనే డౌట్స్ మరోసారి కలుగుతున్నాయీ ట్రోల్స్ అండ్ మీమ్స్ చూస్తోంటే.