NTR : దేవర సెకండ్ సాంగ్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది..

Update: 2024-08-02 12:08 GMT

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ మాస్ కు పెద్దగా కనెక్ట్ కాలేదు. అందుకే ఈ సారి అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య వచ్చే డ్యూయొట్ ను రిలీజ్ చేయబోతున్నాం అని గతంలోనే చెప్పారు. చెప్పినట్టుగానే ఫైనల్ సాంగ్ రెడీ అయింది. ఈ నెల 5న దేవర సెకండ్ సింగిల్ ను విడుదల చేస్తున్నాం అని అఫీషియల్ గా ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన వస్తుందని కూడా ఎదురు చూశారు అభిమానులు. వారి ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఫైనల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. పచ్చని వనాల మధ్య దేవ కన్యలా ఉన్న జాన్వీని పట్టుకుని ఎన్టీఆర్ ప్రేమగా చూస్తున్నట్టుగా ఉంది. దీంతో ఈ సారి రెడ్ సీ కాదు.. గ్రీనరీ అని ఆ మధ్య అనిరుధ్ చెప్పిన మాట నిజమే అని తేలింది.

కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ రెండు భాగాలుగా వస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్. జాన్వీ కపూర్ ఈ మూవీతోనే సౌత్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా ఎంటర్ అవుతున్నాడు. మొత్తంగా దేవర సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకూ సినిమాపై పెద్దగా అంచనాలైతే లేవు. మరి ఈ పాట ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచుతుందేమో చూడాలి.

Tags:    

Similar News