హీరోయిన్ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్‌పై హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడుకున్నారని పేర్కొన్నారు. ‘వండర్ బార్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ధనుష్ ఆ సినిమాను నిర్మించారు. ఇటీవల ఈ విషయంపై నయన్, ధనుష్ మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.
‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నయనతార కెరీర్, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలను ఇందులో చూపించారు. ముఖ్యంగా విఘ్నేశ్ శివన్‌తో ఆమె పరిచయం, ప్రేమ, పెళ్లితో ఇది సిద్ధమైంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’లో నయనతార హీరోయిన్‌గా నటించారు. ధనుష్ నిర్మాత. ఆ సినిమా సెట్‌లోనే నయన్ - విఘ్నేశ్ స్నేహం మొదలైంది. అందుకే ఈ సినిమా వీడియోలు, పాటలను డాక్యుమెంటరీలో చూపించాలని ఈ దంపతులు భావించారు. కాకపోతే అందుకు ధనుష్ అంగీకారం తెలపలేదు.