మల్టీ టాలెంటెడ్ స్టార్ ధనుష్ దసరా బరిలో నిలుస్తున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు దర్శకుడుగానూ సత్తా చాటుతున్నాడు ధనుష్. పైగా తను డైరెక్ట్ చేస్తోన్న సినిమాల కథలు కూడా తనే రాసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన రాయన్ తో సీరియస్ గా ఆకట్టుకున్న ధనుష్ ఈ యేడాది జాబిలమ్మ నీకు అంత కోపమాతో యూత్ ను మెప్పించాడు. ప్రస్తుతం తన డైరెక్షన్ లోనే నిత్య మీనన్ హీరోయిన్ గా ‘ఇడ్లీ కడై’అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తెలుగులో ఇడ్లీ కొట్టుగా రాబోతోన్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నారు.
ఇడ్లీ కొట్టును దసరా రోజునే అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. నిజానికి ఈ చిత్రాన్ని ఆగస్ట్ లో ఇండిపెండెన్సే సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నాడు. ఆ టైమ్ కు తన మాజీ మామ రజినీకాంత్ కూలీ మూవీ అనౌన్స్ కావడంతో తనే అక్టోబర్ 2కు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. నిజానికి ఈ మూవీతో కూలీని ఢీ కొట్టడం కూడా అంత సేఫ్ ఏం కాదు.
ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించిన కుబేర మూవీ జూన్ లో విడుదల కాబోతోంది. సో.. ఈ యేడాది ధనుష్ డైరెక్ట్ చేసిన చిత్రాలు రెండు, నటించినవి రెండు సినిమాలూ విడుదలవుతున్నాయన్నమాట.