Tollywood : నయన్- ధనుష్ గొడవేంటి.. ఆ 15 సెకన్ల వీడియో క్లిప్ ఎక్కడిదో తెలుసా?
హీరోయిన్ నయనతారకు హీరో ధనుష్ లీగల్ నోటీసు పంపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్-నయనతార మధ్య గొడవకు కారణమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ సేతుపతి-నయనతార జంటగా 2015లో విఘ్నేశ్ శివన్ 'నానుమ్ రౌడీ దాన్' సినిమా తీశారు. దీనికి నిర్మాత ధనుష్. ఇటీవల నయనతార జీవితంపై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. ఇందులో నానుమ్ రౌడీ దాన్ షూటింగ్ సందర్భంగా నయనకి విఘ్నేశ్ సీన్ వివరిస్తున్న 15 సెకన్ల క్లిప్‌ను వాడారు. తన అనుమతి లేకుండా ఎలా వాడతారంటూ నయన్‌కి ధనుష్ 10 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ లీగల్ నోటీసులు పంపారు. దీంతో ధనుష్‌పై నయనతార, విఘ్నేశ్ తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల నుంచి NOC అడుగుతుంటే తప్పించుకు తిరిగిన ధనుష్ సెకన్ల క్లిప్‌కు పదికోట్లు అడగడంపై నయనతార ఆగ్రహం వ్యక్తం చేశారు.