ఏ ముహూర్తాన ఈ మూవీ రిజల్ట్ సెట్ అయిందో కానీ.. ధురంధర్ రిలీజ్ తర్వాత అన్నీ బ్లాక్ బస్టర్ వార్తలే వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ధురంధర్ 2 విషయంలోనూ అదే కనిపిస్తోంది. ఈ మూవీ ఈ నెల 19న విడుదల కాబోతోంది. రిలీజ్ కు ముందే భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఆ ట్రైలర్ చూస్తే మరో స్థాయిలో ఉండబోతోంది ఈ మూవీ కూడా అనిపించేలా ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించాడు. అతనితో పాటు సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం చేశాడు. ఇంతకు ముందు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఉరి మూవీకీ అతనే దర్శకుడు. ఇక ఈ మూవీ పెయిడ్ ప్రీవ్యూస్ విషయంలో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం హైదరాబాద్ లోనే ఆల్రెడీ కోటి రూపాయలు వచ్చేసింది.
యస్.. ధురంధర్ ద రివెంజ్ మూవీకి పెయిడ్ ప్రీవ్యూస్ పై భారీ అంచనాలున్నట్టుగా ఉన్నాయి. అందుకే హైదరాబాద్ లో ఆల్రెడీ కోటి రూపాయల నెట్ వసూళ్లు వచ్చేశాయి. హైదరాబాద్ లోనే ఈ స్థాయిలో ఉంటే.. ఇక ముంబైతో పాటు నార్త్ లో మెయిన్ సిటీస్ లో ఏ స్థాయిలో ఉంటుందో అంచనాలకు కూడా అందలేవు అన్నట్టుగా ఉంది. ఓ రకంగా ఈ మూవీకి ఇది బ్లాక్ బస్టర్ స్టార్టింగ్ అనే చెప్పాలి. మరి రిలీజ్ తర్వాత రిజల్ట్ ఇంకే స్థాయిలో ఉండబోతుందో అనేది చూడాలి.