Samantha : సమంత మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ వచ్చింది

Update: 2026-03-09 11:21 GMT

రెండో పెళ్లి తర్వాత సమంత చేస్తున్న మూవీ మా ఇంటి బంగారం. ఈ టైటిల్ కు పూర్తి భిన్నమైన కంటెంట్ తో రూపొందుతోంది అనిపించేలా ఉంది మూవీ గ్లింప్స్. సమంత మాస్ ఆటిట్యూడ్ తో కనిపించబోతున్న మూవీ ఇది అనిపించారు. అప్పుడు విడుదల చేసిన టీజర్ తో మాత్రం అదిరింది అనిపించారు. పూర్తిగా కొత్తగా కనిపించబోతోంది సమంత అనిపించారు. బివి నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. ఇంతకు ముందు నందిని చేసిన జబర్దస్త్ మూవీలో నటించింది సమంత. ఆ మూవీ డిజాస్టర్ అయింది. తర్వాత ఓ బేబీతో బాగా ఆకట్టుకుంది. ఓ బేబీ సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో రూపొందుతోన్న మూవీ ఇదే.

ఇక ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది మూవీ టీమ్. మే 15న అంటే మాంచి సమ్మర్ లో రిలీజ్ అవుతోంది. ఆ టైమ్ కు అందరికీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మంచి డేట్ ఇదే అనిపించేలా ఉంది. సమంతతో పాటు దిగంత్ మంచాలె, గుల్సన్ దేవయ్య, గౌతమి కీలక పాత్రల్లో నటించారు. అన్నట్టు ఈ మూవీ సమంత సొంత బ్యానర్ లోనే నిర్మించింది. మరి నిర్మాతగా మెయిన్ లీడ్ గా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News