Naga Shaurya : నాగశౌర్యను అంతా లైట్ తీసుకున్నారే..?

Update: 2026-04-08 10:20 GMT

హీరోగా వరుస వైఫల్యాలతో ఉన్నాడు నాగశౌర్య. అతని చివరి హిట్ ఏంటి అనేది కూడా చాలామందికి తెలియకుండా పోయింది. 2018లో వచ్చిన ఛలో చిత్రమే అతని చివరి విజయం. మరి ఈ స్థాయిలో ఫ్లాపులు వస్తుంటే ఆడియన్స్ లో పెద్దగా క్రేజ్ కనిపించదు కదా. రంగబలి అనే మూవీతో అయితే ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశాడు. సెకండ్ హాఫ్ దారుణంగా పడిపోయింది. ఏదేమైనా నాగశౌర్య ప్రస్తుతం బ్యాడ్ బాయ్ కార్తీక్ అనే మూవీతో వస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. కానీ ఆ మూవీ నుంచి మినిమం సౌండ్ కూడా రాలేదు. ఇది చాలా అంటే చాలా ఆశ్చర్యం అనే చెప్పాలి. నాగశౌర్య మూవీ ట్రైలర్ ను ఎవరూ పట్టించుకోకపోవడం విచిత్రమే అని చెప్పాలి.

బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ ట్రైలర్ సైతం యావరేజ్ గానే ఉంది. ఏమంత ఆకట్టుకోలేదు. పైగా నాగశౌర్య నుంచి ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ కథలను ఎక్స్ పెక్ట్ చేసే పరిస్థితి లేదు. అతన్నుంచి వరుసగా ఫ్లాపులు వస్తుంటే కాస్త కథల్లో వైవిధ్యం చూడాలి. కొత్తదనం ఉన్న కథలను ఎంచుకోవాలి. అలా కాదని.. ఇలాంటి రొటీన్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ తో వస్తుంటే ఆడియన్స్ లో ఆ మాత్రం ఆసక్తి కూడా పోతుంది. అదే ఈ మూవీ ట్రైలర్ చూస్తే అదే అర్థం అవుతుంది. రమేష్ అనే దర్శకుడు రూపొందించిన సినిమా ఇది. చాలా బాగా ఆలస్యంగా వస్తోందీ మూవీ. చాలాకాలంగా చిత్రీకరణలోనే ఉంది. ఇలా సడెన్ గా ట్రైలర్ అంటే ఆడియన్స్ మినిమం ప్రిపేర్ కూడా కాలేదు కదా. అందుకే చాలామంది లైట్ తీసుకున్నట్టుగా అర్థం అవుతోంది. అదీ కాక ఈ మూవీ ఈ నెల 17న విడుదల అని చెప్పారు. ఆ రోజు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అంటే బ్యాడ్ బాయ్ గుంపులో గోవిందం అన్నట్టుగా ఉండబోతోంది అనేది అర్థం అవుతోంది. ఏదేమైనా ఒకప్పుడు కాస్త ప్రామిసింగ్ గా కనిపించిన నాగశౌర్య సినిమా సినిమాకూ ఇలా దిగిపోవడం మాత్రం ఇక ఇప్పుడు ఆశ్చర్యం కూడా కాదేమో. 

Tags:    

Similar News