గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మూవీ పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. మామూలుగా అయితే ఈ నెల 30న విడుదల చేస్తాం అని చెప్పారు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్స్ చూస్తుంటే ఈ డేట్ న రావడం వందశాతం కష్టమే అని తెలిసిపోయింది. ఈ మూవీ ఇంకా వారం రోజుల పాటు షూటింగ్ ఉందట. ఒక ఐటమ్ సాంగ్ బ్యాలన్స్ కూడా ఉంది. ఈ పాటను ఈ నెల 9నుంచి స్టార్ట్ చేస్తారు అనే టాక్ కూడా ఉంది. మరి ఈ ఐటమ్ సాంగ్ లో నర్తించేది ఎవరు అని చాలామంది ఆరాలు తీశారు. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ చేస్తుందని చాలామంది భావించారు. ఇంకొందరైతే పూజాహెగ్డే అని అన్నారు. ఈ ఇద్దరినీ కాకుండా ఎవరూ ఊహించని అమ్మాయి ఈ ఐటమ్ లో కనిపించబోతోంది.
కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన బ్యూటీ మానస వారణాసి. తను ఈ పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ చేయబోతోంది అని క్లియర్ గా తెలిసిపోయింది. ఈమె గురించి ఎవరూ ఊహించి ఉండరు కదా. కానీ తనే ఈ ఐటమ్ సాంగ్ చేయబోతోంది. మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతో డిజాస్టర్ చూసింది. కపుల్ ఫ్రెండ్లీలో మంచి నటన కూడా చూపించింది. విజయమూ అందుకుంది. దీంతో ఈమెకు వరుసగా ఆఫర్స్ వస్తాయి అని చాలామంది అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధం అయిందట.. ఆ పాటలో అంత మేటర్ ఉందా అనిపిస్తోంది. లేదంటే.. ప్రస్తుతం టైమ్ పెద్దగా లేదు కాబట్టి ఇలాంటి అమ్మాయి అయితే సడెన్ గా పూర్తి చేసే అవకాశం ఉందని అనుకుని ఉంటారు. ఫైనల్ గా పెద్దిలో ఐటమ్ సాంగ్ ను మానస వారణాసి వరకు వచ్చింది. మరి ఇందులో ఇంకేదైనా మార్పు ఉందా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ మూవీలో కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నాడు. జగపతిబాబు ఓ స్పెషల్ గెటప్ తో కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతం చేస్తున్నాడు.