Dil Raju : అల్లు అర్జున్ వివాదంపై దిల్ రాజు రియాక్షన్

Update: 2024-12-24 12:15 GMT

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అమెరికా నుంచి వచ్చాడు. రాగానే సిఎమ్ ను కలిసినట్టు చెప్పాడు. తర్వాత ప్రస్తుతం సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స తీసుకుంటోన్న బాలుడు శ్రీ తేజను హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించాడు. ఈ సందర్భంగా ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెబుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

దిల్ రాజు... మాట్లాడుతూ..

‘‘పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం.. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు చూస్తుంటాం. ప్రభుత్వానికి, సినిమా కి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా ఈమధ్య నియమించారు సిఎం. గేమ్ ఛేంజర్ ప్రమోషన్ కోసం యూఎస్ వెళ్లాను. నిన్న వచ్చాను.. ఇవ్వాళ సిఎం రేవంత్ నీ కలిశాను.

రేవతి భర్త భాస్కర్ నీ ఇండస్ట్రీ కి తీసుకుని వచ్చి ఏదోక జాబ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ల బాధ్యత నేను తీసుకుంటాను. FDC ద్వారా వీరికి ఏవిధమైన సహకారం అందించగలిగితే అవి అందిస్తాం. ప్రభుత్వానికి ఇండస్ట్రీ కి మధ్యలో ఉండి. భాస్కర్ కుటుంబాన్ని మేము బాధ్యత తీసుకుంటాం. శ్రీ తేజ ఆరోగ్యం కుదుట పడుతుంది. సిఎం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. సిఎం రేవంత్ తో కూడా వీరి బాధ్యత తీసుకోవడం పై చర్చించాను. ఆయన ఒకే అన్నారు..

ఇటువంటివి జరగటం దురదృష్టకరం. ఎవ్వరూ కావాలని చెయ్యరు. నేను అల్లు అర్జున్ నీ కలవబోతున్నాను. టెక్నికల్ గా భాస్కర్ కి జరిగేవి అన్ని జరుగుతాయి.

మేము అండగా నిలబడుతం...’’ అన్నాడు.

ఇక ఈ ఘటనకు తెరపడినట్టేనా అంటే.. ‘ఎపిసోడ్ జరుగుతుంది. ఏం జరుగుతుందో ఎన్ని మలుపులు తిరుగుతుందో మనకు తెలుసు. ఇండస్ట్రీ నుంచి, గవర్నమెంట్ నుంచి రెండు రకాలుగా జరుగుతుంది. ఇండస్ట్రీ నుంచి, గవర్నమెంట్ నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుని రూట్ వేస్తాం..’ అనే కామెంట్ కూడా చేశాడు దిల్ రాజు.

మరి అల్లు అర్జున్ ను కలిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం వస్తుందనే దానిపై ఇండస్ట్రీ అంతా ఈగర్ గా ఎదురుచూస్తోంది. ఏదేమైనా వీలైనంత త్వరగా ఈ ఇష్యూకు ఎండ్ కార్డ్ పడాలని కోరుకుందాం. 

Tags:    

Similar News