Allu Arjun : అల్లు అర్జున్ మూవీలో రానా ..?

Update: 2026-02-16 12:16 GMT

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ సెలెక్షన్ మారింది. వైవిధ్యమైన కథలు, దర్శకులను ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో వచ్చిన పుష్ప, పుష్ప 2తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పుష్ప 2 తో ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. తర్వాత త్రివిక్రమ్ తో మూవీ చేయాలనుకున్నాడు. కానీ సడెన్ గా అట్లీ సీన్ లోకి వచ్చాడు. దీంతో త్రివిక్రమ్ మూవీని హోల్డ్ లో పెట్టాడు. అట్లీతో మూవీ చేస్తున్నాడిప్పుడు. ఈ మూవీ ప్యాన్ వరల్డ్ రేంజ్ లో ఉండబోతోంది అనే టాక్ బలంగా వినిపిస్తోంది. వాల్డ్ వైడ్ ఆడియన్స్ ను టార్గెట్ చేసేలా ఉండబోతోంది అనిపిస్తోంది. అలాంటి మూవీలో రానా కూడా ఎంటర్ అయితే ఎలా ఉంటుంది. బాహుబలితో రానా వాల్డ్ వైడ్ ఆడియన్స్ కు తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థాయి మూవీ చేయలేదు. అలాంటి అవకాశం ఈ మూవీతో వస్తే ఎలా ఉంటుంది.

యస్.. రీసెంట్ గా దర్శకుడు అట్లీ .. రానాను కలిశాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడట. మామూలుగా అయితే ఈ మూవీలో ఫీమేల్ లీడ్ లో దీపికా పదుకోణ్, జాన్వీ కపూర్ కనిపించబోతున్నారు. మృణాల్ ఠాకూర్ కూడా ఉంటుందని టాక్. అయితే ఇప్పటి వరకు ఈ మూవీలో విలన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు. ఆ క్లారిటీ రానా ఎంట్రీతో ఉండబోతోందని సమాచారం. అట్లీతో పాటు అల్లు అర్జున్ ను కూడా కలిశాడట రానా. అంటే ఈ ముగ్గురి మధ్య ఇంకేదో జరగబోతోంది అనిపించేలా ఉంది. నిజంగా ఈ ప్రాజెక్ట్ లో రానా కూడా నటిస్తే మాత్రం ఆ మూవీ ఓ రేంజ్ లో ఉండబోతోంది అనిపించేలా ఉంది. మరి నిజంగా రానా ఎంట్రీ మూవీలోనా లేక మూవీ గురించా అనేది తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News