Harish Shankar : బాలీవుడ్‌కి హరీష్ శంకర్... అల్లు అర్జున్ సినిమా రీమేక్..!
Harish Shankar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్ చిత్రంతో స్టార్ డైరెక్టర్‌ల లిస్టులో చేరిపోయాడు హరీష్ శంకర్..;
Harish Shankar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్ చిత్రంతో స్టార్ డైరెక్టర్‌ల లిస్టులో చేరిపోయాడు హరీష్ శంకర్.. గద్దలకొండ గణేష్ చిత్రం తర్వాత ఖాళీగా ఉన్న హరీష్.. ప్రస్తుతం పవన్‌తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాని చేస్తున్నాడు. అయితే కరోనా మహమ్మారి, పవన్ వరుస సినిమాలకి కమిట్ అవ్వడం వలన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది.
ఇదిలావుండగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు హరీష్ శంకర్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దువ్వాడ జగన్నాథమ్ (డీజే) సినిమాని అక్కడ రీమేక్ చేయనున్నాడట హరీష్.. హిందీ ప్రేక్షకుల నేటివిటీని దృష్టిలో ఉంచుకుని వారి అభిరుచికి తగ్గట్లుగా కథలో స్వల్ప మార్పులు చేశాడట హరీష్.
దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. హరీష్ ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడట.. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే వెలువడనుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నట్లు సమాచారం.