Jailer 2 : జైలర్ 2 స్క్రిప్ట్ రెడీ .. వెయిట్ చేయండి : డైరెక్టర్ నెల్సన్

Update: 2024-09-03 05:00 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో గతేడాది వచ్చిన మూవీ ‘జైలర్’బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు వరుస ఫ్లాప్​ లతో ఉన్న రజనీకి ‘జైలర్’ సినిమా మంచి కమ్ బ్యాక్ నిచ్చింది. దాదాపు రూ.700 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో రజనీ యాక్టింగ్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్ లకు ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్​ రవిచంద్రన్ అందించిన బీజీఎం సినిమాకు మరో అస్సెట్ గా నిలిచింది. తాజాగా జైలర్2 గురించి సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. పార్ట్2 ఉంటుందని గతంలోనే మేకర్స్ ప్రకటించిన సంగతి తలెఇసిందే. సీక్వెల్ గురించి డైరెక్టర్ నెల్సన్ ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘జైలర్2 స్క్రిప్ట్ రెడీగా ఉంది.ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ నెలలోనే ఓ అప్ డేట్ ఇస్తాం. వెయిట్ చేయండి’ అని నెల్సన్ తెలిపారు. దీంతో జైలర్2 షూటింగ్ వచ్చే నెలలోనే ప్రారంభమయ్యే చాన్స్ ఉంటుందని తెలుస్తోంది.

Tags:    

Similar News