Prashanth Neel : గొప్ప మనసు చాటుకున్న కేజీఎఫ్ డైరెక్టర్.. కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం..

Prashanth Neel : ప్రశాంత్ నీల్ నీలకంఠాపురంలో ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం అందించారు

Update: 2022-08-16 08:19 GMT

Prashanth Neel : కేజీఎఫ్ డైకెర్టర్ ప్రశాంత్ నీల్ తన తండ్రి 75వ జయంతి సందర్భంగా నీలకంఠాపురంలో ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం అందించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి ఎవరో కాదు.. రాఘువీరాకు సోదరుడు. నీలకంఠాపురంలోనే ప్రశాంత్ నీల్ జన్మించాడు. కానీ తరువాత బెంగళూరులోనే పెరిగి చదువుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. ఇటీవళ ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి మృతి చెందారు. ఆయన అంత్యక్రియల్ని అనంతపురం సత్యసాయి జిల్లాలోని నీలకంఠాపురంలో నిర్వహించారు. అందుకే ప్రశాంత్ నీల్ తరచూ నీలకంఠాపురానికి వస్తుంటాడు.

రఘువీరా ట్విట్టర్‌లో.. నా సోదరుడు సుభాష్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ నీల్ నీలకంఠాపురం గ్రామానికి రూ.50 లక్షలు ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజునే ఆగస్టు 15, 1947న జన్మించినట్లు చెప్పారు.


Tags:    

Similar News