Ram Gopal Varma : పునీత్ లేడన్న నిజాన్ని ఇప్పటికి నమ్మలేకపోతున్నా : ఆర్జీవీ
Ram Gopal Varma : గుండెపోటుతో గతేడాది కన్నుమూసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక లేడన్న నిజాన్ని ఇప్పటికి నమ్మలేకపపోతున్నాని అన్నారు.;
Ram Gopal Varma : గుండెపోటుతో గతేడాది కన్నుమూసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక లేడన్న నిజాన్ని ఇప్పటికి నమ్మలేకపపోతున్నాని అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తన కొత్త చిత్రం 'మా ఇష్టం' ప్రమోషన్ లో భాగంగా బెంగుళూర్ వెళ్ళిన ఆర్జీవీ.. అక్కడ పునీత్ సమాధికి నివాళులర్పించారు. పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కిల్లింగ్ వీరప్పన్ మూవీ షూటింగ్ టైమ్‌లో పునీత్‌ను పలుమార్లు కలిసినట్టుగా తెలిపారు. పునీత్ ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికి హీరోగానే ఉన్నాడని కొనియాడారు. పునీత్ ఆఖరి చిత్రం 'జేమ్స్' విజయంపై కూడా ఆర్జీవీ హర్షం వ్యక్తం చేశారు. వర్మ వెంట హీరోయిన్లు అప్సరరాణి, నైనా గంగూలీ ఉన్నారు.
If it can happen to someone as fit and as great a person as #PuneethRajkumar it is all the more reason why one should not believe in GOD ..Makes me really ANGRY pic.twitter.com/O4yILL8Jj7
— Ram Gopal Varma (@RGVzoomin) March 29, 2022