ఆస్కార్-2025 బరిలో నిలిచిన ఏకైక ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ‘అనుజా’కు నిరాశ ఎదురైంది. 22 నిమిషాల డచ్ మూవీ ‘ఐయామ్ నాట్ రోబోట్’కు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఢిల్లీలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు బాలికల జీవిత కథ ఆధారంగా ‘అనుజా’ను ఆడమ్ జే గ్రేవ్స్ తెరకెక్కించారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం.
ఆస్కార్-2025లో ‘అనోరా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీకి బెస్ట్ పిక్చర్‌తో సహా 5 కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. రష్యాలోని రిచ్ ఫ్యామిలీ యువకుడు USలో ఒక వేశ్యను ప్రేమ వివాహం చేసుకుంటాడు. ఈ విషయం తెలియడంతో అతడిని పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. ‘అనోరా’ ఒక లాటిన్ పదం. దీనికి తెలుగులో గౌరవం అని అర్థం. వేశ్యలూ మనుషులే.. వారిని చిన్న చూపు చూడొద్దని ఈ మూవీలో చూపించారు.