Disha Patani : అందాల అప్సరస.. దిశా పటాని ఫోటోలు వైరల్

Update: 2025-03-31 07:15 GMT

'లోఫర్' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ దిశా పటాని. ఆ తర్వాత ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాతో స్టార్ డమ్ అందుకుంది. గతేడాది విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్తో పాటు రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ కీ రోల్ ప్లే చేశారు. అయితే కల్కి తర్వాత ఈ ముద్దుగుమ్మకి తెలుగులో మరో ఆఫర్ రాలేదు. మరోవైపు సూర్య 'కంగువ'కు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఇక మూవీల సంగతి ఎలా ఉన్నా ఈ చిన్నది మాత్రం అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. నెట్టింట్లో ఫుల్ యాక్టీవ్ ఉంటూ నిత్యం అందాలతో అదరగొడుతోంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో దిశా పటాని లైవ్ పెర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేసింది. ఆ డ్రెస్ కుర్రకారు మనసు నుంచి ఇంకా బయటకు పోలేదు. అప్పుడే మరొక స్టైలిష్ లుక్లో సోషల్ మీడియాలోకి వచ్చింది ఈ గ్లామర్ క్వీన్. తాజాగా దిశా పటాని తన ఇన్స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో అదిరిపోయే ట్రెండీ అవుట్ వేర్ ఫొటోస్ కు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అందాల అప్సర అంటూ ఈ ముద్దుగుమ్మను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక దిశా ప్రస్తుతం 'వెల్కమ్ టు ద జంగిల్' అనే హిందీ సినిమాలో నటిస్తోంది.

Tags:    

Similar News