టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫేమ్ తెచ్చుకున్న నటి దివి వాద్యకు సోషల్ మీడియా ద్వారా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ‘బిగ్ బాస్' షోద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైన దివి.. కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్లో నటించింది. అయితే ఏవి కూడా అనుకున్న రేంజ్లో మాత్రం గుర్తింపు తీసుకురాలేదు. ఇటీవల లంబసింగి సినిమాలో హీరోయిన్ గా మెరిసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా దివి నెట్టింట షేర్ చేసిన ఫొటోస్ వైరల్ గా మారాయి. లైట్ పింక్ శాటిన్ గౌన్ ఆమె పోజులు అందరినీ ఆకట్టుకున్నాయి. మ్యాచింగ్ ఈయరింగ్స్, కర్లీ హెయిర్ స్టైల్తో గ్లామర్ కు మరో అర్థం చెప్పింది.ఈఫొటోలకు 'ఆంఖోం సే లీజియే' అనే క్యాప్షన్తో అభిమానులను పోజ్ ఫుల్ మూడ్ లోకి తీసుకెళ్లింది. ప్రస్తుతం దివి ఒక థ్రిల్లర్ సినిమాతో పాటు కొన్ని కొత్త వెబ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇటు తన ఫ్యాషన్, గ్లామర్.. అటు నటన అన్నింటినీ సమపాళ్లలో మిక్స్ చేస్తూ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటోంది బ్యూటీ.