DJ Tillu Twitter Review: సిద్ధు మరో హిట్ కొట్టాడుగా.. 'డిజె టిల్లు' ట్విట్టర్ రివ్యూ
DJ Tillu Twitter Review: డీజే టిల్లు క్యారెక్టర్, కామెడీ టైమింగ్ అన్నీ బాగున్నాయని, సిద్ధూ చాలా ఈజీగా చేశాడని ప్రశంసించారు.;
DJ Tillu Twitter Review: డిజె టిల్లు, సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ-డ్రామా. భారీ బజ్‌ని క్రియేట్ చేసిన ట్రైలర్ సినిమా కోసం ఎదురుచూసేలా చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం శనివారం (ఫిబ్రవరి 12)న విడుదలైంది.
విమల్, సిద్ధు కలిసి డిజె టిల్లుని సృష్టించారు. ఊహించిన విధంగానే ఈ చిత్రం సినీ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించిన నెటిజన్లు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కాన్సెప్ట్ యూత్‌కి మంచి రిప్రెష్‌నెస్‌ని ఇచ్చిందని అంటున్నారు. డీజే టిల్లు క్యారెక్టర్, కామెడీ టైమింగ్ అన్నీ బాగున్నాయని, సిద్ధూ చాలా ఈజీగా చేశాడని ప్రశంసించారు.
సిద్ధూ పోషించిన DJ టిల్లు పాత్ర ఇప్పటిది కాదు.. నా సినీ కెరీర్ ప్రారంభ రోజులలో హైదరాబాద్‌లో కొంతమంది DJలను కలుసుకుని వారితో ఇంటరాక్ట్ అయ్యాను. వారి బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్, వాళ్లు మాట్లాడేవిధానం, విభిన్నమైన వ్యక్తిత్వం అన్నీ చిత్రంగా అనిపించాయి. అప్పుడే నా మదిలో ఈ కథ రూపుదిద్దుకుంది. ఈ లక్షణాలన్నింటిని కలిపి ఓ కథ రాసుకున్నాను. అదే ఇప్పుడు డిజె టిల్లుగా మీ ముందుకు వచ్చింది అని దర్శకుడు విమల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు."
ఈ చిత్రంలో ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ ప్రధాన తారాగణం. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల స్వరాలు సమకూర్చగా, ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలను యూత్‌ను ఆటకట్టుకున్నాయి.. మిలియన్ల వ్యూస్‌ని సంపాదించాయి.