తెలుగు సినిమాకు చివరి నవరస నటుడుగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు మరణం ఎందరినో కలచి వేసింది. వయో భారంతో మరణించిన ఆయన లోటు తెలుగు సినిమాకు ఎవరూ పూడ్చలేనిది. అయితే ఎవరి మరణానంతరం అయినా కొన్ని జ్ఞాపకాలు నెమరువేసుకోవడం అందరూ చేసేదే. కోట లైఫ్ లో చాలా కాంట్రవర్శీస్ కూడా ఉన్నాయి. అయితే ఇది కాస్త వెరైటీ. అప్పుడు యాంకర్ గా ఉన్న అనసూయ గురించి ఎవరో అడిగితే ఆమె ఎవరో నాకు తెలియదు అనేశారు కోట. దీంతో ఆ టైమ్ లో అనసూయ తన స్టైల్లో కొంత రెచ్చిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె నటన అంటే తనకు ఇష్టమే కానీ.. ఆమె వేసుకునే బట్టలు నాకు నచ్చవు అన్నారోసారి. అంతే అనసూయ కోపం కట్టలు తెంచుకుంది. కోటను నోటికొచ్చినట్టు విమర్శించేసింది.
"అంత అనుభవం ఉన్నవారు ఇలా నీచంగా మాట్లాడటం బాధాకరం. ఎవరెవరైనా ఏ దుస్తులు ధరిస్తారు అనేది వారి వ్యక్తిగతం. వృత్తి పరంగా, పాత్రల ప్రామాణికతకు అనుగుణంగా తాము వేసుకునే దుస్తుల్ని తప్పుగా అర్థం చేసుకోవడం తగదు" అంటూ కౌంటర్ ఇచ్చింది. అంతే కాదు.. "మందు తాగుతూ, అసభ్య దుస్తులతోనే పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం విచారకరం" అని ఇంకాస్త ఘాటుగా స్పందించింది. ఈ విషయం అప్పట్లో వైరల్ గా మారింది. అఫ్ కోర్స్ చాలామంది కోట శ్రీనివాసరావునే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. కామెంట్స్ పెట్టారు. ఆయన పోయిన తర్వాత ఈ విషయాన్ని కూడా ప్రస్తుతం సోషల్ మీడయాలో చర్చించుకుంటున్నారు కొందరు. మరి ఇలాంటివి ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి.