Prabhas : కన్నప్ప కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..

Update: 2025-02-13 06:00 GMT

విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రంపై అతను భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇండియాలోని టాప్ యాక్టర్స్ అందరికీ ఇందులో భాగస్వామ్యం చేశాడు.ఫీమేల్ లీడ్ లో ప్రీతి ముకుందన్ ను తీసుకున్నారు. కీలక పాత్రల్లో మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం నటిస్తున్నారు.అక్షయ్ కుమార్ శివుడుగా, కాజల్ పార్వతిగా కనిపించబోతున్నారు. మోహన్ లాల్, ప్రభాస్ లవి గెస్ట్ రోల్స్. అయితే ఇందులో ప్రభాస్ శివుడి వాహనమైన నందిగా కనిపించబోతున్నాడని రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ తో అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా కోసం ప్రభాస్ తీసుకుంటోన్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ప్రస్తుతం కంట్రీలోనే నెంబర్ వన్ స్టార్ గా ఉన్నాడు ప్రభాస్. అలాంటి స్టార్ కేమియో చేసినా కోట్లు కుమ్మరించాల్సిందే. కానీ ఇక్కడ ఉన్నది డార్లింగ్ కదా. అందుకే ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటిస్తున్నాడు. అది కూడా మోహన్ బాబుతో తనకు ఉన్న రిలేషన్ వల్ల. బుజ్జిగాడు మూవీ నుంచి వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ మోహన్ బాబు.. ప్రభాస్ ను బావా(బుజ్జిగాడులో త్రిష మోహన్ బాబు చెల్లిగా నటించింది కదా అలా)అని పిలుస్తుంటాడు.ఆ రిలేషన్ వల్లే ఫ్రీగా నటిస్తున్నాడట.ఎంతైనా రెబల్ స్టార్ ది దొడ్డ మనసు కదా..

Tags:    

Similar News