Sara Arjun : దురంధర్ బ్యూటీకి చిరంజీవి మూవీలో ఛాన్స్

Update: 2026-02-04 07:26 GMT

దురంధర్ మూవీ దేశవ్యాప్తంగా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. కేవలం హిందీలోనే ఈ మూవీ వెయ్యి కోట్ల మార్క్ ను దాటేసి మరీ వసూళ్లు సాధించడం మాత్రం బిగ్గెస్ట్ ఎఛీవ్మెంట్ అనే చెప్పాలి. అసలు ఈ మూవీ అంత పెద్ద విజయం సాధిస్తుందని మేకర్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. అందుకే వెంటనే దురంధర్ 2తో రెడీ అయిపోయాడు. ఇందుకోసం కేవలం మూడు నెలల్లోనే రెడీ కావడం పెద్ద విషయమే. దురంధర్ 2ను మార్చి 19న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ తో పాటుగా నటించిన బ్యూటీ సారా అర్జున్. తను చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా ఆకట్టుకుంది. తమిళ్ లో విక్రమ్ తో నాన్న అనే మూవీలో చిన్న పిల్లగా బాగా నటించింది. అలాంటి తను దురంధర్ లో కాస్త హాట్ గా కనిపించడంతో చాలామంది సర్ ప్రైజ్ అయ్యారు. తన పాత్ర, కాస్ట్యూమ్స్ చూస్తే ఇంక చిన్న పిల్లేం కాదు ఈ పాప అనిపించింది. అలాంటి బ్యూటీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మూవీలో నటించబోతోంది అనే వార్తలు వస్తుండటం విశేషం.

చిరంజీవి మూవీలో సారా అర్జున్ అనే మాట వినగానే చాలామంది తన పాత్రేంటీ అనే అనుకుంటున్నారు. యస్.. అలాంటి వారందరికీ తను ఈ మూవీలో చిరంజీవి కూతురగా నటించబోతోంది అని వినిపిస్తోంది. మెగాస్టార్ కూతురుగా సారా అర్జున్ అనే మాట స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో రూపొందే సినిమా ఇది. ఈ మూవీలో తండ్రీ, కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో కథ సాగుతుందట. అందుకే సారాను తీసుకోవాలనుకుంటున్నారు. తనైతే నటన పరంగా ఆకట్టుకుంటుంది. అలాగే దురంధర్ తో క్రేజ్ తెచ్చుకుంది.అందుకే తననే తీసుకోవాలనుకుంటున్నారు. మరి ఈ న్యూస్ ఆల్మోస్ట్ నిజమే అని తెలుస్తోంది.

Tags:    

Similar News