Mowgli Trailer : తన ప్రేమకోసం యుద్ధం చేస్తున్న ప్రతి ఓడు హీరోనే

Update: 2025-12-02 10:41 GMT

రోషన్ కనకాల హీరోగా నటించిన మూవీ మోగ్లీ. సాక్షి హీరోయిన్. బండి సరోజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించాడు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 12న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాలా కనిపిస్తోంది. అదే టైమ్ లో సినిమాలో సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న మూవీలానూ కనిపిస్తోంది. హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కనిపిస్తోంది.. అదే టైమ్ లో తను చెవుడు, మూగ అమ్మాయిగానూ కనిపిస్తోంది. మరి ఈ బ్యాక్ గ్రౌండ్ యాక్టర్ గానూ హీరో కూడా కనిపిస్తున్నట్టుగా కూడా ఉంది.

బండి సరోజ్ కుమార్ చెప్పిన అనగనగా ఒక చేప టైప్ కథతో మొదలు పెట్టారు ట్రైలర్. ఆపై హీరో రాజుల కాలంలో గన్ లా కనిపించడం ఏంటీ అంటే అదో ట్రెండ్ అనిపించేలా ఉండే డైలాగ్.. తర్వాత హీరోయిన్ తో అతను ప్రేమలో పడటం.. ఆపై బండి సరోజ్ కుమార్ ఎంటర్ కావడం.. ఇద్దరు మధ్య కాస్త బలమైన బంధం కదలడం కనిపిస్తోంది. ‘లేడీస్ మేటర్ సార్.. సిటీలో లాగా జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత కొవ్వొత్తులు ఎలిగించుకోవడం రోడ్లెక్కం.. డైరెక్ట్ గా కాగడాలు ఎలుగుతాయ్’ అనే డైలాగ్ బావుంది. ‘తన ప్రేమకోసం యుద్ధం చేస్తున్న ప్రతి ఓడు హీరోనే’ అనే పాయింట్ తోనే కనిపిస్తుంది సినిమాలో అనిపిస్తోంది.

రోషన్ కనకాల హీరోగా ఆకట్టుకునేలా ఉన్నాడు. హీరోయిన్ నటనతో మెప్పిస్తుందేమో అనిపిస్తోంది. బండి సరోజ్ కుమార్ నటన హైలెట్ కాబోతోంది అనిపించేలా ఉంది. వైవా హర్ష పాత్ర కూడా ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ మాత్రం బావుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Full View

Tags:    

Similar News