Smriti Irani : ప్రతి నెలా నాకు రూ. 1 అద్దె కడుతోంది : స్మృతి ఇరానీ

Update: 2025-07-04 09:45 GMT

జైబోలో తెలంగాణ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నటీమణి, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ. స్మృతి ఇరానీ దర్శకనిర్మాత కరణ్ జోహారు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ జీవితాన్ని ప్రతిబింబించే పాట ఏది? అన్న ప్రశ్నకు స్మృతి.. పాట సంగతేమోకానీ, కుచ్ కుచ్ హోతా హై మూవీ నుంచి నా లైఫ్ సడన్ గా అగ్నిపథ్ మూవీగా మారిపోయిందని బదులిచ్చారు. 'నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు. అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలా దినుసులు అమ్మేది. నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ, అమ్మ డిగ్రీ దాకా చదివింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు రూ.150 మాత్రమే వారి చేతిలో ఉన్నాయి. గేదెల కొట్టంలోని ఓ గదిలో వారు నివసించేవారు అని పేర్కొన్నారు. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఎందుకో తెలుసా? తను కొడుకును కనివ్వలేదని! అగ్నిపథ్ సినిమాలోలాగే నేను కూడా నా తల్లికి న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఇంటికి అమ్మను తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను. ఎప్పటికైనా ఆ ఇల్లు కొనివ్వాలని డిసైడయ్యాను. దాదాపు అమ్మ జీవితమంతా అద్దింట్లోనే ఉంది. ఆరేళ్ల కిందట తనకు ఇల్లు కొనిచ్చాను. కానీ, ఫ్రీగా ఉండటం ఇష్టం లేక ప్రతి నెలా నాకు రూ. 1 అద్దె కడుతోంది' అని చెప్పు కొచ్చారు స్మృతి ఇరానీ.

Tags:    

Similar News