అక్కినేని నటవారసుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వచ్చే నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహబంధంతో ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. తాతయ్య ఏఎన్నార్ విగ్రహం ఎదురుగా శోభిత మెడలో తాను మూడుముళ్లు వేయనున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చైతన్య తెలిపారు. కుటుంబసభ్యులతోపాటు దాదాపు 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. సంప్రదాయబద్ధంగా జరిగే ఈ పెళ్లి వేడుకను కొత్త జంట ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే దానిని డాక్యుమెంటరీ రూపంలో అందించాలనుకున్నారని, దీని హక్కులు సొంతం చేసుకోవడానికి నెటిక్స్ రూ.50 కోట్లు ఖర్చు పెట్టిందని సోషల్మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి. దీనిపై టీమ్ స్పందించింది. అలాంటిదేమీ లేదని అంతా అబద్ధమంటూ క్లారిటీ ఇచ్చింది. లాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్గా పెళ్లి తంతు నిర్వహించాలనే ఉద్దేశంలో కొత్త జంట ఉందని తెలిపింది.