రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ను బాగా డిజప్పాయింట్ చేశాడు. దీనికి కారణం దర్శకులు కూడా ఉన్నారు. కాకపోతే ఇదేమంత పెద్ద నిరుత్సాహం కాదు. కానీ పండగ టైమ్ లో అభిమాన హీరో నుంచి అప్డేట్స్ వస్తే ఆనందించడం మనోళ్ల రివాజు కదా. ఆ రివాజును తప్పించారు మేకర్స్. జస్ట్ రాజా సాబ్ నుంచి మాత్రం ఓ చిన్న పోస్టర్ వదిలారు. అదీ అంతంతగానే ఉంది. ఇంకేదైనా కొత్తగా ఉంటుందేమో అని ఎక్స్ పెక్ట్ చేస్తే అదేం కనిపించలేదు.
ఇక ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ నుంచి సంక్రాంతి సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందని చాలా ఆశగా ఎదురుచూశారు. కానీ ఫౌజీ గురించి చిన్న వార్త కూడా రాలేదు. ఫౌజీ మాత్రమే కాదు.. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయబోతున్న స్పిరిట్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఇతర కాస్టింగ్ ఎవరు లాంటి విషయాలు పండగ సందర్భంగా చెబుతారేమో అనుకున్నా.. అదీ కాలేదు.
నిజానికి ప్రభాస్ మాత్రమే కాదు.. ఇతర స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి క్రేజీ అండ్ న్యూ అప్డేట్స్ కూడా పెద్దగా రాలేదు. ఈ విషయంలో అందరు హీరో అభిమానులూ డిజప్పాయింట్ అయ్యారు. కాకపోతే రెబల్ స్టార్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. నెంబర్ వన్ ప్యాన్ ఇండియా స్టార్ అయినా.. ఇతర హీరోల్లా యేడాదికోటి అనికాకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అంచేత ఆయన్నుంచి కొత్త సినిమాల కబుర్లేమైనా వస్తాయోమో అని ఎదురుచూస్తే నిరాశ తప్పలేదు.