నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవెయిటెడ్ మూవీ డాకూ మహరాజ్ సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కాబోతోంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు. టీజర్ తో ఒక్కసారిగా హైప్ వచ్చిందీ మూవీకి. తర్వాత విడుదల చేసిన రేజ్ ఆఫ్ డాకూ మహరాజ్ అనే పాట ఎవ్వరికీ పెద్దగా అర్థం కాలేదు. కాకపోతే ఇలాంటి పాటలు మాంటేజ్ గా సినిమాల్లో చాలా బావుంటాయి. సో.. థియేటర్స్ లో ఆకట్టుకునే అవకాశం ఉంది. రీసెంట్ గా వచ్చిన చిన్న పాట బావుంది. కాకపోతే సినిమాకు అడిక్ట్ అయిపోయే లాంటి కంటెంట్ ఇంకా రాలేదు అనే చెప్పాలి. మరోవైపు సంక్రాంతి బరిలో ఉన్న గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ ప్రమోషన్స్ తో దూకుడు పెంచాయి. ఆ రెండు సినిమాలతో పోలిస్తే డాకూ మహరాజ్ కాస్త వెనకబడి ఉన్నాడనే చెప్పాలి.
బాలయ్య కెరీర్ లోనే ఇలాంటి మూవీ చేయలేదు అని చెబుతున్నారు దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటున్నారు. ఇటు చూస్తే ఆ మేరకు ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేయడంలో మాత్రం ఆ రేంజ్ చూపించడం లేదు అనే కంప్లైంట్ ఫ్యాన్స్ నుంచే ఉంది. మామూలుగా సంక్రాంతి అంటే బాలయ్యకు బాగా కలిసొచ్చిన సీజన్. ఇంకా చెబితే బాలయ్య తనతో పాటుగా వస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ ను అన్ స్టాపబుల్ లో చేశాడు. తన మూవీ ప్రమోషన్స్ విషయంలో కామ్ గా ఉన్నాడా అనిపిస్తోందంటున్నారు.
ఏదేమైనా ప్రస్తుతం ఎంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అయినా ప్రమోషన్స్ తో మరింత హైప్ పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో డాకూ మహరాజ్ కాస్త వెనకబడే ఉంది. ఇకనైనా కాస్త దూకుడు పెంచితే ఇంకా బెటర్ కలెక్షన్స్ వస్తాయి కదా అనేది అభిమానుల భావన అంతే.