Film Chamber : ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. షూటింగ్‌లకు నో పర్మిషన్...

Update: 2025-08-08 14:30 GMT

సినీ కార్మికులకు వేతనాలు పెంచాలనే డిమాండ్ తో గత కొన్ని రోజులుగా షూటింగ్ లు బంద్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిలిం ఛాంబర్ షూటింగ్ లపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ నుంచి అనుమతి లేకుండా.. షూటింగ్ లు చేయవద్దని ఆదేశించింది. అవుట్ డోర్ యూనిట్లు, స్టూడియోలలో షూటింగ్లకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. చాంబర్ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మె పై నిర్మాతలు,, యూనియన్లు, కలిసి చర్చలు జరుపుతున్నారు. వేతనాలు పెంచేది లేదని ఇప్పటికే నిర్మాతల మండలి స్పష్టం చేసినప్పటికీ సమ్మె కొనసాగుతూనే ఉంది. తాజాగా ఫిలిం ఛాంబర్ ఆదేశాలతో ఈ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది.

Tags:    

Similar News