కేతిక శర్మ .. 2021లో రొమాంటిక్ అనే మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ మూవీ యావరేజ్ అనిపించుకుంది. ఆ తర్వాత తెలుగులో తను చేసిన అన్ని సినిమాలూ పోయాయి. పెద్ద నటి కాకపోయినా అందంగా ఉంటుంది. గ్లామర్ కురిపించడంలో అభ్యంతరాలు లేవు. అందుకే సినిమాలు పోయినా ఆఫర్స్ వచ్చాయి. అలా రొమాంటిక్ తర్వాత లక్ష్య, రంగరంగ వైభవంగా, బ్రో వంటి మూవీస్ వచ్చాయి. ఈ యేడాది విడుదలైన అదిదా సర్ ప్రైజూ అనే పాట వివాదం కావడం ఆమెకు బాగా కలిసొచ్చింది. ఇక గత వారం వచ్చిన సింగిల్ మూవీ అమ్మడు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న న్యూస్ అందించింది.
సింగిల్ మూవీకి ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ వచ్చింది. దానికి మించిన కలెక్షన్స తో రోజు రోజుకూ దూసుకుపోతోందీ మూవీ. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా.. ఇద్దరికీ ప్రాధాన్యం ఉంది. కామెడీ ప్రధానంగా ఉన్న మూవీ అయినా హీరోయిన్లకు నటనకు ఆస్కారం కనిపించింది. ఈ సారి కేతిక మంచి టైమింగ్ కూడా చూపించింది. దీంతో మంచి గుర్తింపు కూడా వచ్చింది. మొత్తంగా కేతిక శర్మ ఎన్నాళ్లుగానో ఎదరుచూస్తోన్న విజయం అయితే పడింది అనే చెప్పాలి. విశేషం ఏంటంటే.. ఈ మూవీ తెలుగులోనే కాక ఓవర్శీస్ లో కూడా దూసుకుపోతోంది. ఏకంగా అక్కడ శ్రీ విష్ణుకు ఫస్ట్ ఒన్ మిలియన్ మూవీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విజయంతో కేతికకు మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో.