Upasana Konidela: ఉపాసన పోస్ట్‌పై నెటిజన్స్ ఫైర్.. ఇంతకీ అందులో ఏముంది..?
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన.. ఉన్నది ఉన్నట్టుగా, భయం లేకుండా ఏదైనా బహిరంగంగా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి.;
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన.. ఉన్నది ఉన్నట్టుగా, భయం లేకుండా ఏదైనా బహిరంగంగా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. అలా ఆమె మాట్లాడిన చాలా మాటలు ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. అయినా ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాజాగా ఉపాసన పెట్టిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్ తనను మరోసారి వివాదాల్లోకి నెట్టింది. అంతే కాకుండా దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు కూడా. ఇంతకీ అందులో ఏముంది.?
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ గుడి గోపురం ఫోటోని షేర్ చేసింది ఉపాసన. అందులో దేవుళ్ల ఫోటోలకు బదులు.. కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ఫోటోలో తనతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారని, ఎక‍్కడో కనిపెట్టండి అంటూ ఉపాసన ఫాలోవర్స్‌ని కోరారు. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ ఫోటో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని, ఇలాంటి పోస్టులు పెట్టి తనపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
అంతే కాకుండా దేవుళ్ల విగ్రహాలు ఉండాల్సిన గోపురంపై మనుషులు ఉన్నట్లు ఫొటో రూపొందించడం ఏంటంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె ఫొటో, వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఇలాంటి విషయాలపై ఉపసాన ఎన్నోసార్లు ఆమె అభిప్రాయాలను బయటపెట్టారు. తాజాగా అలాంటి ఓ అభిప్రాయం వల్లే ఉపాసన ట్రోలింగ్‌కు గురవుతున్నారు.